వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్రకు ఏపీ ప్రజలనుండి మంచి స్పందన లబిస్తుంది.జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర 115వ రోజుకి చేరుకుంది.ప్రస్తుతం ప్రజసంకల్ప యాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది.రేపు ( సోమవారం )ఉదయం జగన్ ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో నుండి ప్రజసంకల్ప యాత్రను ప్రారంబిస్తాడు.కొమ్మూరులో మానవహారంలో వైఎస్ జగన్ పాల్గొన్న అనంతరం వైఎస్ జగన్ అక్కడే భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కొమ్మూరు, నాగులపాడు మీదుగా కొనసాగిన పాదయాత్ర పెదనందిపాడు శివారుకు చేరుకుంటుంది. పెదనందిపాడులో వైఎస్ జగన్ బహిరంగసభలో పాల్గొని మాట్లాడుతారు . రాత్రికి అక్కడే బస చేస్తారు.కాగా నేడు ఉగాది పండుగ సందర్భంగా జగన్ ప్రజసంకల్ప యాత్రకు విరామం ప్రకటించిన విషయం తెలిసిందే.
