సినీ ఇండస్ర్టీలో ఎందరు హీరోలు ఉన్నా.. అందులో కొందరే రీల్ లైఫ్‌లోనే కాకుండా, రియల్ లైఫ్‌లోనూ హీరోలనిపించుకుంటారు. వారి స్టార్ స్టేటస్‌ను పక్కనపెట్టి మరీ వారి కోసం వచ్చిన అభిమానులతో కలివిడిగా ఉంటారు. అలాంటి హీరోల కోవకు చెందిన వాడే మన యంగ్ రెబల్ స్టార్. బాహుబలి సినిమాతో అటు బాలీవుడ్‌నే కాకుండా హాలీవుడ్‌ను సైతం తన వైపుకు త ఇప్పుకున్నాడు హీరో ప్రభాస్. అటువంటి ప్రభాస్ ఇటీవల ఓ అభిమానితో కలిసి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
see also :
పవన్ నైజం ఇంతే..! సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు..!!
అయితే, బాహుబలి వంటి క్రేజీ ప్రాజెక్టు తరువాత హీరో ప్రభాస్ కమిట్ అయిన చిత్రం సాహో. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. షూటింగ్‌లో ఎప్పుడూ బిజీగా ఉండే ప్రభాస్ ఇటీవల తన అభిమానులను కలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశారట. ఆ సమావేశంలో భాగంగా ప్రభాస్ తన అభిమానితో దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఓ కాళ్లు లేని అభిమాని తనతో సెల్ఫీ దిగేందుకు ఆసక్తి చూపుతుండటంతో వెంటనే విషయం తెలుసుకున్న ప్రభాస్ మోకాళ్లపై కూర్చొని ఆ అభిమానితో సెల్ఫీ దిగాడట. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.