తెలుగు సినీ ఇండస్ర్టీపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన మాటల వేడి ఇంకా చల్లారలేదు. చల్లారకపోగా, అంతకంతకు రగులుతూనే ఉంది. అయితే, తెలుగు సినిమా హీరోలు.. రీల్ లైఫ్‌లోనే హీరోలని, రియల్ లైఫ్ లో హీరోలు కాదని, హీరోయిన్లతో రూములలో కులకడం మాని, తమిళ సినీ ఇండస్ర్టీ హీరోల్లాగా రోడ్డు మీదకొచ్చి పోరాడాలంటూ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సినీ ఇండస్ర్టీపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మా అసోసియేషన్ మొత్తం ఏకమై ఇటువంటి వ్యాఖ్యలు ఇకపై వినపడితే బాగుండదనే రీతిలో టీడీపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన విషయం విధితమే.
see also : సీబీఐ విచారణలో పచ్చి నిజాలు వెలుగులోకి..!!
ఈ నేపథ్యంలో ఇవాళ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ సినీ ఇండస్ర్టీపై అటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధించాయన్నారు. సినీ ఇండస్ర్టీలోని మహిళలు రూములో కులుకుతారా..? మాట్లాడేముందు ఒళ్లు అదుపులో పెట్టుకోమంటూ రాజేంద్ర ప్రసాద్‌ను హెచ్చరించారు. మా దేవుడు, ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఉంటూ ఆయన కనుచూపుల్లో ఎదిగిన సినీ ఇండస్ర్టీపై ఇటువంటి నీచమైన వ్యాఖ్యలు చేయడానికి నీకు నెరెలా వచ్చింది అంటూ ప్రశ్నించారు శివాజీ రాజా.