తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైన తెలుగు వార్త ఛానల్స్ లో ముఖ్యమైన ఛానల్ వీ6.వీ6 ఛానల్ లో ప్రముఖ సీనియర్ న్యూస్ ప్రజెంటర్ రాధిక రెడ్డి నిన్న ఆదివారం ఉద్యోగ విధులు ముగించుకొని హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మూసాపేట్ లోని శ్రీ సువిల అపార్ట్ మెంట్ లో పై అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి
విదితమే.
రాధిక రెడ్డి మెదక్ జిల్లా మానేపల్లికి చెందిన రాధిక రెడ్డి సరిగ్గా ఆరునెలల కిందటే భర్తనుండి విడాకులు తీసుకొని హైదరాబాద్ మహానగరంలో తల్లిదండ్రులతో కల్సి ఉంటుంది.అయితే యధావిధిగా డ్యూటీ ముగించుకొని ఇంటికొచ్చిన రాధిక ఇంట్లోకి వెళ్ళకుండా అపార్ట్ మెంట్ లోని ఐదో అంతస్తుకు వెళ్లి పై నుండి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.ఒక్కసారిగా శబ్దం రావడంతో రాధిక సోదరి వచ్చి చూడగానే తన సోదరి ఆత్మహత్య చేసుకోవడంతో షాక్ కు గురైంది.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకి చేరుకొని పరిశీలించగా రాధిక రెడ్డి బ్యాగ్ లో సూసైడ్ నోటు ఉంది.ఆ నోటులో ఆమె మానసికంగా కల్గుతున్న ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాను.కేవలం మానసిక వేదన వలనే మాత్రమే చనిపోతున్న
..ఎవరు నా మరణానికి కారణం కాదు అంటూ అందులో ఉన్న పోలీసులు చెబుతున్నారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలెట్టారు.