ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఇరవై ఏడు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.ఇప్పటివరకు చేసిన పాదయాత్ర అంటే దాదాపు పదహారు ఆరువందల అరవై మూడు కిలోమీటర్ల దూరం నడిచిన పాదయాత్ర వేరు తాజాగా జిల్లాలో చేస్తున్న పాదయాత్ర వేరుగా అన్నట్లు జగన్ దూకుడు.
ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో చేసిన రాజకీయ విమర్శలు ,అవినీతి ఆరోపణలు చేస్తూ అధికార టీడీపీ పార్టీకి గుంటూరు మిర్చి ఘాటు కంటే ఎక్కువగా చూపిస్తున్నాడు జగన్.టీడీపీ పార్టీకి చెందిన నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తూ నిమ్మకాయల రాజనారాయణ లాంటి నేతలను కాకుండా కింది స్థాయి నేతలను కూడా వైసీపీలోకి చేర్చుకుంటూ అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.
నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు మొదలు ఎమ్మెల్యేలు చేస్తున్న పలు అవినీతి అక్రమాల గురించి వివరిస్తూ అధికార పార్టీ చరిత్రను బయటపెడుతున్నాడు.దీంతో గుంటూరు మిర్చి ఘాటు కంటే ఎక్కువగా రాజకీయాలను హీటేక్కిస్తున్నాడు జగన్ అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..