తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ,రోడ్లు భావనల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ కొత్తగూడెం ,మణుగూరులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.పర్యటనలో భాగంగా మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మణుగూరు లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ దేశానికి పట్టిన శని..తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు.దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ ని మూసివేయాలని మహాత్మాగాంధీ చెప్పారని అన్నారు.ఆనాడు తెలంగాణకు ఆంధ్రా కు నెహ్రు బలవంతపు పెళ్లి చేశారు.తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలను పిట్టల్లా కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ ది …మాల్కి రూల్స్ విషయంలో ఇందిరాగాంధీ తెలంగాణ కు అన్యాయం చేశారన్నారు.కేసీఆర్ నాయకత్వంలో ప్రజలంతా తిరగబడితే..తప్పని పరిస్థితుల్లో నే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు.దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే..ఇంటింటికీ త్రాగునీరు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని చెప్పిన దమ్మున్న ముఖ్యమంత్రి ఒక్క కేసీఆరే అని చెప్పారు.పూర్వ ఖమ్మం జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి తీరుతామన్నారు.తండాలను గ్రామ పంచాయతీలుగా మరుస్తామన్న కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది..తండాలను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రి కేటీఆర్ అన్నారు.