తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా మంత్రి ఇవాళ ఉదయం ఉప్పల్ నియోజకవర్గంలోని సైనిక్ పురిలో మంచినీటి రిజర్వాయర్ ను మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..త్రాగునీటి సమస్యను తీర్చేందుకు రూ.4 కోట్ల 64లక్షలతో … 7 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్ ను నిర్మించినట్లు చెప్పారు. రిజర్వాయర్ ప్రారంభంతో స్థానిక ప్రజల నీటి తిప్పలు తప్పాయన్నారు.అనంతరం బోయిన్ పల్లిలో 20 కోట్లతో రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజల సమస్యల్ని మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్, ఎమ్మెల్సీ జనార్థన్ రెడ్డి, కలెక్టర్ ఎంవీ రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ దానకిశోర్ తదితరులు తదితరుల పాల్గొన్నారు.
Minister @KTRTRS inaugurated three Drinking Water Reservoirs at Sainikpuri. Transport Minister Mahender Reddy, Malkajgiri MP @ChMallareddyMP, MLA @NvssprabhakarM, Mayor @bonthurammohan, Dana Kishore, @MDHMWSSB participated in the program. pic.twitter.com/T6cv2ZBf9x
— Min IT, Telangana (@MinIT_Telangana) April 7, 2018