తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నిత్యం అధికారక కార్యక్రమాల్లో బిజీ బిజీ గా ఉండటమే కాకుండా మరోవైపు కోటి ఎకరాలకు సాగునీళ్లిచ్చే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులను పూర్తిచేయించడంలో అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తుంటారు .అయితే ఎంత బిజీ బిజీ గా ఉన్న కానీ ఒక సామాన్యుడిలా ఉదయం పూట వాకింగ్ చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని అక్కడక్కడే పరిష్కరించే విధంగా మంత్రి కృషి చేస్తారు .తాజాగా మంత్రి హరీష్ రావు జహీరాబాద్ నియోజక వర్గంలో సైకిల్ మీద పర్యటించి సమస్యలను తెలుసుకున్నారు మంత్రి హరీష్ రావు .