శ్రీరెడ్డి గత కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెగ హల్ చల్ చేస్తున్న పేరు .వరస వివాదాలతో ఈ నటి సినిమాలతో ఎంత ఆదరణ పొందిందో తెలియదు కానీ ఇండస్ట్రీ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ ను వివరాలతో సహా తన సోషల్ మీడియా లో పోస్టు చేస్తూ మంచి హాట్ టాపిక్ అయింది .సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే పక్కలో పడుకోవాల్సిందేనంటూ ఘాటు వాఖ్యలు చేసింది. అయితే అంతటి అగకుండ తాజాగా ఆమె ఇటీవల హైదరాబాద్ మహానగరంలో ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేసి ఇండస్ట్రీ ను షేక్ చేసింది . నెల రోజులనుండి ఒక మహిళనైన తాను ఇంత పోరాడుతున్నా అసలు స్పందించలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఫిలిం నగర్ రోడ్ మీద బట్టలూడదీసి నిలబడుతాననని చెప్పి చేసి చూపిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక జాతీయ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె పలు సంచలన విషయాలను తెలియజేసింది. ” నేను కాస్టింగ్ కౌచ్ బాధితురాలిని. ఒక ప్రముఖ నిర్మాత కొడుకు నన్ను స్టూడియోలో వాడుకున్నాడు. మామూలుగా ఆ స్టూడియో ప్రభుత్వంకు చెందినది. కానీ ప్రభుత్వం ఆ స్టూడియోను ఒక వ్యక్తికి కట్టబెట్టింది. ప్రభుత్వం స్టూడియోలను ఎందుకు కట్టబెడుతుంది” అని ప్రశ్నించింది. “ఆ ప్రముఖ నిర్మాత కొడుకు మాట్లాడాలని స్టూడియోకు పిలిచేవాడు. తీరా అక్కడికెళ్తే నాతో బలవంతంగా సెక్స్ చేసేవాడు. బడా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, అగ్ర హీరోలు స్టూడియోలని బ్రోతల్ హౌస్ లలాగా వాడుతారు. నిజానికి స్టూడియోలు సెక్స్ కు ఆపద లేని ప్రదేశాలు. ఇవి రెడ్ లైట్ ఏరియాలు” అంటూ వివాదాస్పద వాఖ్యలు చేసింది.
