మొన్న బుధవారం రాత్రి భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్ ,రాజస్థాన్ రాష్ట్రాలు రెండూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న సంగతి తెల్సిందే .బుధవారం అత్యంత బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పదిహేను మంది ,రాజస్థాన్ రాష్ట్రంలో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు .
మొత్తం గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి అని ఆయా రాష్ట్రాల వాతావరణ శాఖ ప్రకటించింది .ఈ వర్ష బీభత్సంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ప్రఖ్యాత కట్టడమైన తాజ్ మహాల్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఒక పిల్లర్ కుప్పకూలిపోయింది .
అయితే దర్వాజా ఈ రౌజా గా పిలిచే సౌత్ వైపు ఉన్న గేటుకు సంబంధించి పన్నెండు అడుగుల మెటల్ పిల్లర్ పడిపోయింది .అయితే దాదాపు నలబై నిమిషాల పాటు ఏకదాటిగా కురిసిన వర్ష బీభత్సమే కారణమని సంబంధిత అధికార వర్గాలు అంటున్నాయి ..