తెలుగు సినీ పరిశ్రమను ప్రక్షాళన చేసేందుకు మహిళా లోకం కదిలింది. ఆదివారం రోజు సమావేశం అయిన ‘శ్రీరెడ్డి అండ్ కో’ టాలీవుడ్ పెద్దలపై విరుచుకుపడ్డారు. “తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్ధిక దోపిడీలపై బహిరంగ చర్చ” అంటూ మహిళా సంఘాల ఐక్యకార్యాచరణ కమిటిగా ఏర్పడి ఈ బహిరంగ చర్చలో అందరూ రావాల్సిందిగా డిమాండ్ చేసారు. ఇక నటి శృతి అయితే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైనే సంచలన ఆరోపణలు గుప్పించింది. “పవన్ కళ్యాణ్ కు మసాజ్ లు చేయడానికి బెంగాలీ అమ్మాయిలు కావాలి. ఇప్పటివరకు మీకు తెలుసా ఈ విషయం? ఏయ్ తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా పనికిరారా?” అంటూ పవన్ పేరెత్తి సంచలన ఆరోపణలకు తెరతీసింది. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులను సాక్ష్యాలతో సహా బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ‘నా దగ్గర ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి, దమ్ముంటే పవన్ కళ్యాణ్ ను రమ్మనండి నేను చూపిస్తాను’ అంటూ సవాల్ విసిరింది. ఇలా శృతి మాట్లాడుతున్న సమయంలో నటి అపూర్వ సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. పవన్ పేరెత్తగానే శృతి చేయి పట్టుకుని అపూర్వ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, వెనక్కి తగ్గని శృతి ఆరోపణలను కొనసాగించారు. ఈ ఎన్నికలలో మహిళా లోకం పవన్ కళ్యాణ్ కు ఓటు వేయవద్దని, ప్యాకేజ్ లకు అమ్ముడుపోవడానికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ పై చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
