టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేస్తున్న ప్రస్తుత తాజా వివాదాంశం క్యాస్టింగ్ కౌచ్ .ఈ అంశాన్ని తెరపైకి తెచ్చి గత రెండు నెలలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ,సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు శ్రీరెడ్డి.అయితే గత రెండు నెలలుగా చేస్తున్న శీరెడ్డి రచ్చ వెనక ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ హస్తం ఉంది .అందుకే ఆమె ఇటివల జనసేన అధినేత ,టాలీవుడ్
స్టార్ హీరో పవన్ కళ్యాణ్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కాకుండా ఏకంగా పవన్ తల్లిని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ,వాళ్ళ అనుచవర్గం అదే మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
అయితే ఈ గ్లోబల్ ప్రచారం మీద వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు స్పందించారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ “ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఎవరు రచ్చ చేస్తూ వివాదాలు సృష్టిస్తున్న కానీ వారి వెనక వైసీపీ పార్టీ ఉందని అనడం ఫాషన్ అయింది .
ఒకరి వెనక ఉండి మరి ఉన్నది ఉన్నట్లు మాట్లాడే ఖర్మ లేదు .ఏది అయిన సరే వైసీపీ నేతలే స్వయంగా మీడియా ముందుకొచ్చి ఎక్కడ అన్యాయం జరిగిన కానీ దాన్ని బయటపెట్టే సత్తా దమ్ము నిజాయితీ వైసీపీ వాళ్ళకు ఉందని ..శ్రీరెడ్డితో వైసీపీ పార్టీకి సంబంధం ఉందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు .