Home / MOVIES / భరత్ అనే నేను సూపర్ హిట్..తేల్చేసిన ప్రముఖ క్రిటిక్..!!

భరత్ అనే నేను సూపర్ హిట్..తేల్చేసిన ప్రముఖ క్రిటిక్..!!

తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆతురతతో ఎదిరిచుస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమా మరికొన్ని గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటించగా..కైరా అద్వాని హిరోయిన్ గా నటిస్తుంది.అయితే మహేష్ ఒక పొలిటికల్ లీడర్ గా కనిపించడం ఇదే మొదటిసారి.

అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్,పాటలు అభిమానులను ఎంతగానో ఆకర్షించాయి.ఈ క్రమంలో ప్రముఖ సినీ క్రిటిక్ , దుబాయ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమర్ సందు ఈ సినిమాకు మొదటి రివ్యూ ఇచ్చేశాడు.భరత్ అనే నేను సినిమా బ్లాక్ బాస్టర్ అని తేల్చేశాడు.అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రిన్స్ మాట్లాడుతూ..భరత్ అనే నేను సినిమా తన కెరీర్ లోనే ఒక మంచి పెర్ఫామెన్స్ అని అన్నారు…అది అక్షరాల సత్యం అయిందని సందు తెలిపాడు.

ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను సిమాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి..కథపైనే ఎక్కువ దృష్టి పెట్టారు.మంచి కంటెంట్ తో ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా దర్శకత్వం వహించారు.మహేష్ బాబుతో కొరటాల శివ సినిమా తీయడం ఇది రెండో సారి.మొదటి సినిమా శ్రీమంతుడు.