ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నేత ,మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఫోన్ చేశారు .నిన్న బుధవారం ఉదయం రామనారాయణ రెడ్డి సోదరుడు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి అనారోగ్య కారణంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో మరణించిన సంగతి తెల్సిందే .
ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనం వివేకానందరెడ్డి మృతిపట్ల సంతాపం ప్రకటించారు .రామనారాయణ రెడ్డికి ఫోన్ చేసి జగన్ ఓదార్చారు.ప్రస్తుతం పాదయాత్రలో ఉండటం వలన రాలేకపోయాను ..త్వరలోనే స్వయంగా వస్తాను అని చెప్పారు .అయితే గత కొంతకాలంగా ఆనం రామనారాయణ రెడ్డి తో సహా ఆనం వారసులు వైసీపీలో చేరతారు అని వార్తలు వస్తున్నా సంగతి తెల్సిందే ..