కేంద్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీజేపీ కంబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన కుంభకోణాలపై మండిపడ్డారు.
‘‘బాబాలు, స్వాములు, సన్నాసులు, కుంభకోణాలు, ఇప్పుడు ఆశారాం బాపులు, డేరా రామ్ రహీమ్ బాబాలు, నీరవ్, లలిత్ మోదీలు.. ఇదా ఈ దేశం ఖర్మ.
ప్రజలకు బ్యాంక్‌లలో డబ్బులు దొరకవు. మోదీలు మాత్రం మనకు గుండు కొట్టి పోతారు. దేశాలు విడిచి పోతూనే ఉంటారు.. మనం అనుభవిస్తూ ఉండాలి. ఆహా కాంగ్రెస్, ఓహో బీజేపీ అంటూ పొగుడుతూనే ఉండాలి. ఇది ఈ దేశం చేసుకున్న ఖర్మానా. బీజేపీలోని బ్రహ్మచారులను చూసి, నీరవ్ మోదీలను చూసి.. మిమ్మల్ని పొగిడి మీకు డబ్బా కొట్టాలా.. ఇక సాగవు, ఇంతకాలం సాగింది’’ అంటూ కేసీఆర్ హెచ్చరించారు.