సిగ్నల్ ఫ్రీ వ్యవస్థలో భాగంగా అండర్ పాస్ ల నిర్మాణంను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.ఇందులో భాగంగా హైటెక్ సిటీ సమీపంలో రూ.25 కోట్లుతో నిర్మించిన మైండ్ స్పేస్ అండర్ పాస్ ను ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
హైదరాబాద్ మహానగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మరుస్తామని అన్నారు.రూ.23 కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ పనులను చేపట్టామని… త్వరలోనే చింతల్‌కుంట ఫ్లై ఓవర్‌ను ప్రారంభిస్తాం అని చెప్పారు . మే 5 న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ చేతుల మీదుగా రూ.1500 కోట్లతో నిర్మించనున్న స్కైవేలను శంకుస్థాపన చేస్తామని అన్నారు.
Along with Deputy CM Mahmood Ali Saab & Transport Minister Mahendar Reddy Garu inaugurated the underpass at Mind space junction
Also announced the timelines for completion of various works under Strategic Road Development Plan (attached) pic.twitter.com/UIVziOBEWt
— KTR (@KTRTRS) April 28, 2018
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.ఈ ప్రాజెక్ట్ ను రెండేళ్లలో పూర్తి చేశారు. 368 మీటర్ల పొడవు, 28 మీటర్ల వెడల్పుతో ఈ అండర్ పాస్ నిర్మాణం జరిగింది.
The government has constructed the underpass at a total cost of Rs. 25.78 crores. The underpass is expected to ease traffic congestion by providing a conflict free movement at the junction and will provide relief to traffic moving from Cyber Towers to Biodiversity junction. pic.twitter.com/FufdfmC4dY
— Min IT, Telangana (@MinIT_Telangana) April 28, 2018