ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇటివల కర్నూలు జిల్లాకు చెందినా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ,ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి దాదాపు నాలుగు వందల కార్లతో భారీ ర్యాలీగా మూడు వేలమంది కార్యకర్తలతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో
వైసీపీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే .
మరోవైపు ప్రస్తుత అధికార టీడీపీ నేత ,యలమంచిలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు వచ్చే నెల ఐదో తారీఖున వైసీపీ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే .తాజాగా అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో హోం మంత్రిగా పని చేసిన వసంత నాగేశ్వరరావు తనయుడు ,నందిగామ నియోజకవర్గ టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్ కూడా వైసీపీ పార్టీలో చేరనున్నారు .
ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ పార్టీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు .ప్రస్తుతం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తన అనుచవర్గంతో సహా వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ఆయన తెలిపారు ..