తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంకు ఔటర్ వరప్రదాయిని అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా పూర్తి చేసుకున్న కండ్లకోయ జంక్షన్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
Ministers @KTRTRS and Mahender Reddy formally inaugurated the Kandlakoya interchange on Outer Ring Road. pic.twitter.com/PLDXfuKOgx
— Min IT, Telangana (@MinIT_Telangana) May 1, 2018
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.జౌటర్ చుట్టూ ఇంటర్ కనెక్టెడ్ గ్రిడ్ ఏర్పాటు చేసి.. హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా ప్రణాళికలు తయారు చేస్తామన్నారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందులో భాగంగానే SRDP కింద అండర్‌పాస్ లు నిర్మిస్తున్నామని చెప్పారు. స్కైవేల కోసం డిజైన్ల బడ్జెట్ సిద్ధంగా ఉందన్నారు.
Ministers @KTRTRS and Mahender Reddy formally inaugurated the Kandlakoya interchange on ORR. Mayor @bonthurammohan MP Malla Reddy were among the dignitaries present. pic.twitter.com/I1Y3ChdNPw
— Min IT, Telangana (@MinIT_Telangana) May 1, 2018
ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఇప్పటికే LED లైట్స్ ఏర్పాట్లు చేసి, ప్రమాదాలను అరికడుతున్నామని చెప్పిన కేటీఆర్..భవిష్యత్తులో ఔటర్ చుట్టు టౌన్ షిప్పులు ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాపిక్ కు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో రోడ్డను విస్తరిస్తున్నామని, సుచిత్ర వరకు విఫరీతమైన ట్రాపిక్ ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని… త్వరలోనే ట్రాపిక్ సమస్యలను అధిగమిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు.ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యే కేపీ వివేకానంద,సుదీర్ రెడ్డి,ఎంపీ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.