గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం ఎవరు అని అడిగితే రాజకీయాల మీద కనీసం ఇంగిత జ్ఞానం ఉన్న పోరగాడు సైతం చెప్పే ఒకే ఒక్క కారణం ప్రముఖ సినిమా హీరో ,జనసేన అధినేత ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .పవన్ వచ్చే ఒక నెల ముందు కూడా వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఇటు రాజకీయ వర్గాలతో పాటుగా వైసీపీ శ్రేణులు కూడా భావించారు .
ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాష్ట్రంలో టీడీపీ ,కేంద్రంలో బీజేపీ పార్టీలను ఆశీర్వదించాలని ఇచ్చిన ఒక్క పిలుపుతో అసలు పట్టే లేని ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కాపు సామాజికవర్గం ఉన్న చోట్ల టీడీపీ పార్టీ గెలుపొంది కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతో టీడీపీ అధికారాన్నిహస్తగతం చేసుకుంది .
అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బిగ్ షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదు .మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన పార్టీ పోటిచేస్తుంది.ఈ నెల పదకొండో తారీఖున భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాను అని చెప్పి టీడీపీ అధినేత ,అతని బ్యాచ్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు పవన్ కళ్యాణ్ ..