ఆంధ్రప్రదేశ్ లో కొత్త రాజకీయ రంగు పులుముకుంటోంది. గత నాలుగు సంవత్సరాలనుండి టీడీపీ పాలన అత్యంతా దారుణంగా ఉందని రాజకీయ నాయకులే కాక.. సామాన్య ప్రజలు కూడ చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం అమలు చెయలేని 600 హామీలిచ్చి ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేశారని వైసీపీ నేతలు అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ అయిన టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉండడంతో ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు పెరుగుతున్నాయి. అయితే ఇంతకముందు వైసీపీ నుంచి ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు పలువురు నేతలు టీడీపీ నుంచి కూడా వైసీపీలోకి వస్తున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం అని ఇప్పటికే తెలిసిపోయిందని అందుకే వలసలు జరుగుతున్నాయని అంటున్నారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు.
ప్రస్తుతం చిత్తూరు జిల్లా టీడీపీలో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.టీడీపీ పార్టీకి చేందిన మాజీ మంత్రి గల్లా అరుణ కూమారి చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జి బాధ్యతల నుంచి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి వైదొలిగారు. ఈనెల 1వ తేదిన అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబు ను కలసి ఆయన ఎదుటే తప్పుకొంటున్నట్లు చెప్పేశారు. ఆమె అనూహ్య నిర్ణయం చిత్తూరు జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇకపోతే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి హయాంలో రెండు సార్లు మంత్రిగా పని చేసిన గల్లా అరుణ కుమారి…రాష్ట్రా విభజన జరిగిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో 2014 లో టీడీపీలో జాయిన్ అయ్యారు…2014 ఎన్నికలలో చంద్రగిరి నుండి పోటీ చేసిన ఆమె వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ఇక వచ్చే ఎన్నికలలో నేను పోటీ చేయనని చెప్పారు…అంతేకాకుండా నా కుమార్తె రమాదేవికి కూడా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేసారు. అంటే ఈసారి చెవిరెడ్డికి ఆ పోటి కూడ లేదు. అందుకే మరోసారి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలవడానికి ప్రధాన కారణం నిత్యం ప్రజల్లో ఉంటూ, వాళ్ళ సమస్యలను తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గం లో వైసీపీ మరింత బలంగా ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజారిటీతో రెండో సారి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గెలుస్తాడని ఆ నియోజక వర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు.