ఏపీ ముఖ్యమంత్రి,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు త్వరలోనే జైలుకు వెళ్ళడం ఖాయమా ..ఇప్పటికే దాదాపు నలబైకి పైగా కేసుల్లో ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా ఏకంగా దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో
కూడా త్వరలోనే జైలుకు పోవడం ఖాయం అంటున్నారు రాజకీయ వర్గాలు .
తాజాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశమే లేదు .టీడీపీ పార్టీకి ఆ అవకాశం లేకపోవడంతో తప్పకుండ వేరే పార్టీ గెలుపొందుతుందని ఆయన అన్నారు .
అంతే కాకుండా రేపు శనివారం జరగనున్న కర్ణాటక రాష్ట్ర ఎన్నికల తర్వాత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జైలుకెళ్ళడం ఖాయం .గతంలో నారా చంద్రబాబు నాయుడు చేసిన తప్పులే దీనికి ప్రధాన కారణమవుతాయి అని ఆయన అన్నట్లు వార్తలు వస్తున్నాయి .