ఉప్పల్ నియోజకవర్గంలో ని హబ్సిగూడ డివిజన్ వెంకటరెడ్డి నగర్ లోని విశ్వకర్మ కులస్తులు ఏ. వెంకటేశ్వర చారి రేఖ దంపతుల నివాసంలో గ్రేటర్ హైద్రాబాద్ ఎం.బి.సి నాయకులు వజ్రోజు రవీంద్ర చారి గారు నిర్వహించిన చాయ్ పే ములాఖత్ కార్యక్రమంలో ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.తాడూరి శ్రీనివాస్ గారు స్థానికులతో చాయ్ తాగుతూ కాసేపు సరదాగా ముచ్చటించారు. వారు మాట్లాడుతూ చాయ్ పే ములాఖత్ లాంటి వినూత్న కార్యక్రమాలు నాయకులకు ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తూన్నాయని, ప్రజల యొక్క సమస్యలని తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయొచ్చు అని చెప్పారు.
ప్రభుత్వం చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.నూతనంగా ప్రవేశపెట్టిన ” రైతు బంధు” లాంటి పథకాలు రైతుల కళ్ళలో ఆనందాన్ని నింపాయి అని ఇది దేశంలోనే రైతాంగానికి ఆదర్శనంగా నిలిచిందని చెప్పారు.ఎం.బి.సి కార్పొరేషన్ ద్వారా అత్యంత నిరుపేదలయిన బి.సి గుర్తించి వారి ఆత్మగౌరవాన్ని, ఆర్థిక సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి గారు దృఢ సంకల్పంతో ఉన్నారని, త్వరలోనే ఎం.బి.సి లకు తగిన ప్రాధాన్యత కల్పించడమే ఈ ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
విశ్వకర్మల్లో ఒకరైన అవుసుల (గోల్డ్ స్మిత్) వారు ఎదుర్కొంటున్న సమస్యలను సావధానంగా విన్నారు. వారి యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వారి కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలను వారికి వివరించారు.ఈ కార్యక్రమంలో మేకల శ్రీనివాస్, విశ్వనాథ్ చారి, సుదర్శన్ రెడ్డి, కె.నర్సింహ, మన్సూర్ భాయ్, రఘు, గణేష్, స్వామి, అద్వైత్ రెడ్డి ఎం.బి.సి నాయకులు గడ్డం సాయి కిరణ్, దూగుంట్ల నరేష్, ఎన్.ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.