నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు వెండి తెరకు పరిచయమైన త్రిష అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ క్రేజ్‌ను అనుభవించింది. అయితే, అనతి కాలంలోనే త్రిష పరిస్థితి రివర్స్ అయింది. ఒక్కసారిగా అవకాశాలు తగ్గడం ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు స్టార్ హీరో స్థాయిలో ఉన్న కుర్ర హీరోలతో నటించిన త్రిషి చివరకు ఫిఫ్టీ ప్లస్ దాటిన సీనియర్ హీరోల పక్కన నటించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ అవకాశాలు కూడా తగ్గాయి.
అంతేకాకుండా, తెలుగుతోపాటు తమిళ సినీ ఇండస్ట్రీలో త్రిష మార్కెట్ దారుణంగా పడిపోయింది. దీంతో ఈ భామకు అవకాశాలు ఇచ్చే నిర్మాతలు కూడా కరువయ్యాయి. ప్రస్తుతం చిన్నా చితక లేడీ ఒరియంటెడ్ సినిమాల్లో నటిస్తూ నటిగా రాణిస్తోంది.
ఇదిలా ఉండగా, త్రిష ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉందట. గతంలో ఎంగేజ్‌మెంట్‌కు వెళ్లి త్రిష పెళ్లి హఠాత్తుగా ఆగిపోయిన విషయం తెలిసిందే. పెళ్లిలో భాగంగా షాపింగ్ కోసమని ఇటీవలే విదేశాలకు వెళ్లిందట. అయితే, గతంలో పెళ్లి క్యాన్సిల్ అయిన విషయం మీడియాకు చెప్పేందుకు ముఖం చాటేసిన త్రిష.. ఈ సారైన తనకు కాబోయే భర్తను మీడియాకు చూపుతుందో.? లేదో..? చూడాలి మరీ..!!