ఇటివల తెలంగాణ తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కోడంగల్ ఎమ్మెల్యే ,టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .పార్టీలో చేరిన గత కొంతకాలంగా అంటిముంటని విధంగా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి.అయితే రేవంత్ ఇటు పార్టీ వ్యవహారాలలో ,ఆ పార్టీ నేతలు చేపట్టిన బస్సు యాత్రలో కన్పించకపోవడం వెనక బలమైన కారణాలున్నాయి అని ఆ పార్టీకి చెందిన నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు .
ఇటివల టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన మూడో సీజన్ బస్సు యాత్రకు రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందలేదు.దీంతో రేవంత్ రెడ్డి బస్సు యాత్ర తర్వాత పాదయాత్ర చేస్తాను అని ఆ పార్టీ జాతీయ అధిష్టానాన్ని కోరాడు అంట రేవంత్ రెడ్డి.అయితే ఒక పక్క ఆ పార్టీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పాదయాత్ర చేస్తాను అని రాహుల్ గాంధీను కోరాడు అంట .
అయితే మధ్యలో వచ్చిన రేవంత్ రెడ్డి పాదయాత్రకి అనుమతిస్తే ..సీనియర్ నేతలు అడిగిన పాదయాత్రకి అనుమతివ్వకుండా ఉంటె పార్టీ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతుంది అని అలోచించి రేవంత్ నిర్ణయాన్ని తిరస్కరించారు అంట .దీంతో ఒకపక్క పార్టీలో చేరిన నాటి నుండి తనకు జరుగుతున్న అవమానాలతో పాటుగా సాక్షాత్తు పార్టీ జాతీయ అధిష్టానమే తనను పక్కన పెట్టడంతో రేవంత్ రెడ్డి ఈ అవమానాలను మరిచిపోవడానికి ..పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయంతో అమెరికా పోవాలని వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు అంట .అయితే రేవంత్ రెడ్డి ప్రస్తుతం పార్టీ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై హస్తం పార్టీ నేతలు రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.అందుకే ఇలా పాదయాత్రకి అనుమతివ్వలేదని ..టీపీసీసీ చేపట్టిన పాదయాత్రకు ఆహ్వానం లేదని సాకులు చెబుతున్నారు అని వ్యాఖ్యానిస్తున్నారు .