ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఇప్పటికే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు వైసీపీలో చేరుతున్న సంగతి తెల్సిందే.తాజాగా రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు వైసీపీ పార్టీలో చేరబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.అప్పటి ఉమ్మడి ఏపీలో దివంగత
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ..దాదాపు పదేళ్ళ మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి వైసీపీ పార్టీలో చేరనున్నారు.
అయితే అప్పటి నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఎన్ రఘువీరారెడ్డి టీడీపీ పార్టీలో చేరనున్నారు అని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో తనకు ,తన అనుచవర్గానికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలతో పాటుగా కొన్ని అడిగారు రఘువీరా .అయితే రఘువీరారెడ్డి అడిగిన వాటికి చంద్రబాబు నో చెప్పడంతో ఆయన యూ టర్న్ తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన ఆ పార్టీ సీనియర్ నేత ,ప్రస్తుతం ఎంపీ అయిన అతన్ని కల్సి వైసీపీ పార్టీలో రానున్నట్లు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.అయితే ఈ విషయం గురించి సదరు వ్యక్తీ జగన్ కు చేరవేయడంతో రఘువీరారెడ్డి అడిగిన కొన్నిటిని అంగీకరించి రానున్న ఎన్నికలో హిందూపురం పార్లమెంటు స్థానం నుండి బరిలోకి దిగటానికి జగన్ అనుమతిచ్చారు .దీంతో జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన చూపు వైసీపీ వైపు పడింది.అయితే గత నాలుగు ఏండ్లుగా పార్టీ తన ప్రభావల్యాన్ని కోల్పోవడం..కనుచూపు మేరలో పార్టీ
బ్రతికి బట్ట కట్టే ఆలోచనలు లేకప్వడంతో రఘువీరారెడ్డి వైసీపీ వైపు మళ్లుతున్నారు అని జిల్లా రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు ..