ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ,అతని తనయుడు ,టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ,మంత్రి నారా లోకేష్ నాయుడు పై విరుచుకుపడ్డారు .
గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పెద్ద బాబు దగ్గర నుండి చిన్నబాబు వరకు ,టీడీపీ పార్టీ కార్యకర్త నుండి మంత్రి వరకు అందరూ పంచ భూతాలను దోచుకొని లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారు .
వారి బ్యాంకుల్లో సొమ్ము పెరుగుతుంది కానీ ప్రజల బ్రతుకులు మారడంలేదు .అవినీతిలో చంద్రబాబు నెంబర్ వన్ ..లోకేష్ నెంబర్ టూ స్థానాల్లో నిలిచారు అని ఆయన హెద్దేవా చేశారు ..