తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనునిత్యం రైతుల కోసం ఆరాటపడుతున్నారు. వ్యవసాయం బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది అని భావిస్తున్నారు. అందుకే ప్రతి నీటిబొట్టును వినియోగించుకొని ఆయకట్టుకు నీరు అందిస్తున్నారు. అందుకే ఈ సంవత్సరం మంచి పంట పండి రైతుల కళ్ళలో సంతోషం చూస్తున్నాం. పండిన పంటకు మంచి ధర అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం . 3308 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసాం. ఈ సీజన్లో 35 లక్షల ధాన్యం సేకరణ టార్గెట్ పెట్టుకొని ఇప్పటికే 33 లక్షల ధాన్యం సేకరించి రికార్డు సృష్టించాం.
10 కోట్ల గన్ని బాగ్స్ అందుబాటులో ఉంచాం. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోతే రైతులు ఇబ్బంది పడకుండా తడిచిన ధాన్యం కూడా కొనుగోలుచేసినం. రైతుని ఆదుకున్నాం. రైస్ మిల్లర్స్ కస్టమ్ మిల్లింగ్ రైస్ కూడా వెంటనే తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం. దీనివల్ల డిపార్ట్మెంట్ అప్పులు కట్టకుండా కాపాడగలుగుతున్నాం. సివిల్ సప్లై కార్పొరేషన్ అంతర్గత సామర్ధ్యం పెరిగింది. నష్టాలు తగ్గించగలిగినం. 4 సంవత్సరాల్లో శాఖా ను ప్రక్షాళన చేసినం. అక్రమాలు అరికట్టినం. ఈ పాస్ మిషన్ల వల్ల బియ్యం అక్రమ రవాణ ఆగింది. అక్రమాలు చేసే వారిపై పీడీ యాక్ట్ పెడుతున్నాం. మావైపు నుండి చాల ప్రయత్నం చేస్తున్నాం.
పేదవాడి బియ్యం దళారుల పాలయ కాకుండా ఉండాలి అంటే ప్రజల సహకారం అవసరం. కేంద్రం 1.91 కోట్ల మందిని BPL గా గుర్తిస్తే మన రాష్ట్రము 2.74 కోట్ల మందిని పేదవారుగా గుర్తించి కాప్ లేకుండా బియ్యం అందిస్తుంది. బియ్యం తినకపోతే తీసుకోకండి. మీ కార్డు పోకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటాం. కడుపునిండా అన్నం పేట్టాలన్న ప్రభుత్వ ప్రయత్నం కు అడ్డుపడుతున్న వారిని ఎవరిని వదిలి పెట్టం. రేషన్ డీలర్ల సమస్యలపై సీఎం గారికి పూర్తి అవగాహనా ఉంది. సివిల్ సప్లై కమిషనేర్ గారు వారితో చర్చలు జరుపుతారు. తెల్ల రేషన్ కార్డ్స్ ఇవ్వడం నిరంతర ప్రక్రియ. 2 లక్షల అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. అన్నిటినీ పరిశీలించి అర్హులయిన వారందరికీ తెల్ల కార్డ్స్ అందిస్తాం. ఈరోజు సచివాలయం లో రైస్ మిల్లర్లు తో సమావేశం అయి ధాన్యం సేకరణ., బియ్యం తిరిగి ప్రభుత్వానికి చెల్లించే అంశంపై చర్చించారు. ఆగష్టు లోపు మొత్తం బియ్యం అందించాలని కోరారు. సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, కమిషనర్ అకున్ సబర్వాల్ తో కలసి మంత్రి ఈటల మీడియా తో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు