Home / POLITICS / మురుస్తున్న పల్లెలు..!!

మురుస్తున్న పల్లెలు..!!

కనిపించని కుట్రల వెనుక పల్లె కన్నీరు పెడుతున్నదంటూ నాలుగేండ్ల కిందటిదాకా గోరటి ఎంకన్న రాసిన పాటను ఊరూరా పాడుకొన్నం. నీళ్లులేక.. పొలాలను పడావు పెట్టి పట్నంమొకం పట్టి పోయెటోళ్లతో ఎర్రబస్సులు నిండిపోయేటివి. రోడ్లుండవు.. నీళ్లు రావు.. కరంటు ఉండదు.. ఓట్ల పండుగొస్తె మాత్రం కాంగ్రెసోళ్లు.. తెలుగుదేశపోళ్ల కార్లు పొలోమని దుమ్మురేపుకొంటూ వచ్చేటివి. మాయమాటలు చెప్పి ఓట్లేయించుకొని ఐదేండ్లపాటు అడ్రస్ లేకుండా పోయెటోళ్లు.. ఏ పని గురించి ఎవరినైనా అడగాలంటే.. ఆఫీసు ఆమడదూరం.. అధికారులు మరింత దూరం.. అమాత్యులు అల్లంతదూరం అన్నట్టుండేది.. నాలుగేండ్లయింది.. తెలంగాణ వచ్చినంక ఇవాళ ఒక్కసారి పల్లెల్లోకి పోతే.. ఇవి అప్పటి పల్లెలేనా అనిపిస్తున్నది. 50 ఏండ్లలో జరుగని అభివృద్ధి నాలుగేండ్లలో కండ్లముందు కనిపిస్తున్నది.పల్లెలకు ఇవాళ రాజయోగం పట్టింది. ఏండ్లతరబడి నిరాదరణకు గురైన గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. దశాబ్దాలుగా తండాలుగా, గూడేలుగా ఉన్న ప్రాంతాలు ఇవాళ గ్రామశోభను సంతరించుకొన్నాయి. ఎండకాలం వచ్చిందంటే రోడ్లకు అడ్డంగా ఖాళీబిందెలతో నీళ్ల కోసం ఆందోళనలకు దిగేరోజులు పోయాయి. సమస్యలను పరిష్కరించాలని నిలదేసే పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదు. ఎరువులు.. విత్తనాలకోసం చెప్పుల క్యూల మాటే లేదు. చెరువులు నిండుగా కనిపిస్తున్నాయి. వాగు మత్తడి దుంకితే రాకపోకలు బంద్ అవుతాయన్న దిగులు లేదు. ఇప్పుడు అవసరమున్న చోటల్లా వంతెనలు నిర్మాణమయ్యాయి.చెక్‌డ్యాంలు వచ్చాయి. ఒకప్పుడు పండుగలొస్తేనే ఊళ్లల్లో కరంట్ బుగ్గలు వచ్చేవి. ఇప్పుడు ఎల్‌ఈడీ బల్బులు వెలుగులు పంచుతున్నాయి. నాలుగేండ్ల కిందటి వరకూ ఆరు గంటలు కరంట్ ఉంటే చాలా సంబురంగా ఉండేది. ఇప్పుడు రెప్పపాటు కూడా కరంట్ పోవడంలేదు. మారుమూల పల్లెలు కూడా ఇంటర్నెట్‌తో అనుసంధానమైనాయి. తెలంగాణలో సగర్వంగా స్వపరిపాలన మొదలైనప్పటినుంచి పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యంలో రూ.73 వేల కోట్ల నిధులను ఖర్చుపెట్టింది. మన ఊరు-మన ప్రణాళికతో వేల కోట్లను వెచ్చించింది. వ్యవసాయం, చేతి వృత్తులు మళ్లీ పుంజుకొన్నాయి. తాజా గా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన నూతన పంచాయతీరాజ్‌చట్టం పల్లెలకు మరిన్ని అభివృద్ధి ఫలాలను అందించబోతున్నది. పాలకవర్గాలకు అధికారాలను విస్తృతంగా ఇచ్చి నిజమైన గ్రామస్వరాజ్యసాధన దిశగా ముందుకు వెళ్తున్నారు. గ్రామాల్లోని అంతర్గత రోడ్లకోసమే రూ.5వేల కోట్లను ఖర్చుచేయబోతున్నారు. ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలను ముందస్తు అభివృద్ధి నిధుల రూపంలో ఇవ్వనున్నారు.రూ.73 వేల కోట్ల నిధులు
—————————————–
గ్రామాల అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ నుంచి తెలంగాణ సర్కారు భారీగా నిధులిచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013-14లో అప్పటి 23 జిల్లాలకు రూ. 13వేల కోట్లను కేటాయిస్తే.. తెలంగాణ సర్కారు తెలంగాణలోని పంచాయతీలకు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రూ.13,877 కోట్లను ఖర్చుచేసింది. పల్లెల్లో ఏండ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను ఏడాది కాలంలోనే పరిష్కరించింది. నీటిగోస నుంచి విముక్తిచేసింది. 2014-15లో రూ.13,877.07 కోట్లు, 2015-16లో రూ.15,993.89 కోట్లు, 2016-17లో రూ.12,846.33 కోట్లు, 2017-18లో రూ.14,723.42 కోట్లను పంచాయతీరాజ్ శాఖ నుంచి పల్లెల అభివృద్ధికోసం వెచ్చించిన ప్రభుత్వం 2018-19లో రూ.15,563 కోట్లను కేటాయించింది.గ్రామజ్యోతికి అదనంగా రూ.25 వేల కోట్లు
—————————————–
గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఊరోళ్లంతా కలిసి ఊరికేం కావాలో ప్రణాళిక సిద్ధం చేసుకొంటే, వాటికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. గ్రామీణ స్థాయిలో ఎవరికివారే తమ ప్రణాళికలు తయారు చేసుకొని అమలు చేయాలన్న ఉద్దేశంతో 2015 ఆగస్టు 15న సీఎం కేసీఆర్ గ్రామజ్యోతిని ప్రారంభించారు. ఐదేండ్ల కాలంలో ప్రతి పంచాయతీకి రూ.2 నుంచి రూ.6 కోట్లను ఈ పథకంలో ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం రూ.25 వేల కోట్లను ఈ పథకం కింద అదనంగా కేటాయించారు. గ్రామాలను దత్తత తీసుకొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరును దత్తత తీసుకున్నారు. అంతేకాకుండా 2,587 గ్రామాలను ప్రజాప్రతినిధులు, పోలీసులు, ఇతర అధికారులు దత్తత తీసుకుని అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలను నిర్మించారు. 2015-16లో 2,17,896 పనులను రూ. 2,542 కోట్లు, 2016-17లో 2,28,099 పనులను రూ. 2919 కోట్లతో పూర్తిచేశారు.మన ఊరు-మన ప్రణాళిక
తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభ్యున్నతికోసం ప్రవేశపెట్టిన మరో పథకం మన ఊరు-మన ప్రణాళిక. క్షేత్రస్థాయిలో ఊరికోసం ప్రణాళికలు చేసేందుకు, ప్రజలతో చర్చించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మన ఊరు – మన ప్రణాళిక అంటూ మండలాధికారులను గ్రామాల బాట పట్టించారు. స్థానికంగా సమావేశాలు జరిపి గ్రామానికి కావాల్సిన అవసరాలను గుర్తించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 8695 గ్రామాల్లో 60,039 పనులకు రూ. 17,634 కోట్లు, 438 మండల పరిషత్‌ల్లో 4,380 పనులకు రూ. 13,789 కోట్లు, 9 జిల్లా పరిషత్‌ల పరిధిలో 376 పనులకు రూ. 17,439 కోట్లు విడుదల చేశారు.నూతన పంచాయతీ రాజ్ చట్టం
—————————————–
తెలంగాణ రాష్ట్రంలో అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్.. పంచాయతీరాజ్ సంస్థల బలోపేతంపై సుదీర్ఘ కసరత్తు చేశారు. ఇప్పటివరకు నామమాత్రంగా ఉన్న పంచాయతీ పాలకవర్గానికి పూర్తిస్థాయి అధికారాలను కట్టబెడుతూ చట్టంలో మార్పులుచేశారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌కు జాయింట్ చెక్‌పవర్, విధులపట్ల నిర్లక్ష్యంచేస్తే పాలకవర్గాన్ని రద్దుచేయడంతో ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాల్సిన బాధ్యత చట్టం ద్వారా ఏర్పడింది. గ్రామాభివృద్ధి నిధుల వినియోగం, మొక్కలు నాటడం, పారిశుద్ధ్య లోపం లేకుండా చూడటం వంటి బాధ్యతలను చేరుస్తూ ప్రధాన మార్పులు చేశారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత మరుగుదొడ్డిని ఏర్పాటు చేయడం పాలకవర్గం ప్రధాన బాధ్యతగా పొందుపర్చారు. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న రిజర్వేషన్ విధానంలో మార్పులుచేశారు. జనాభా ప్రాతిపదికన ఒకే రిజర్వేషన్ వరుసగా రెండుఎన్నికలకు వర్తింపచేయనున్నారు. తండాలను, శివారు ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. కొత్త గ్రామాల ఏర్పాటుతో వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి పథంలో నడువనున్నాయి. ప్రతి పంచాయతీలో నాలుగు స్టాండింగ్ కమిటీలను ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డు, వైకుంఠధామాల నిర్వహణకు ఒక కమిటీ, వీధిదీపాల నిర్వహణకు మరో కమిటీ, మొక్కలునాటడం, హరితహారం కోసం ఓ కమిటీ, అభివృద్ధి పనులకు మరో స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసుకొనే అవకాశాన్ని కొత్త చట్టంలో కల్పించారు.రూ. 2,500 కోట్లతో సీసీ రోడ్లు
—————————————–
తెలంగాణ ప్రభుత్వం పల్లెల్లో నడకదారులకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. ఇప్పటిదాకా పలు గ్రామాల్లో సీసీరోడ్ల, అంతర్గత రోడ్లకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లను ఖర్చుచేసింది. కొత్తగా ఏర్పాటైన 4,383 గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ కింద రూ.5 వేల కోట్లను ప్రభుత్వం ఖర్చుపెడుతున్నది. ఇప్పటివరకు రోడ్ల సౌకర్యం సరిగా లేని వాటిని గుర్తించి కొత్తగా రోడ్లను వేయనున్నారు. గ్రామాలు, మండలాలకు లింక్ రోడ్లను నిర్మించనున్నారు.పల్లె ప్రగతి
——————————
రాష్ట్రంలో అత్యంత వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన పథకం పల్లె ప్రగతి. 150 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. చిన్న తరహా రైతులు, ఎస్సీ, ఎస్టీల కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా దీన్ని చేపట్టారు. మొత్తం రూ. 642 కోట్లను వెచ్చించారు. 48 మండలాల్లో 37 వేల మంది రైతులతో వరి ఉత్పత్తి సంస్థలు, 50 మండలాల్లో 50 వేల మంది రైతులతో కంది ఉత్పత్తి సంస్థలతో పాటు పలు చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేశారు.
-ప్రతి పంచాయతీకి రూ. 20 లక్షలు
-అడుగడుగునా ఎల్‌ఈడీ వెలుగులు
-2,587 గ్రామాలను దత్తత తీసుకొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు
-డంపింగ్‌యార్డ్‌లు, శ్మశాన వాటికల నిర్మాణం
-37 వేలమంది రైతులతో వరి ఉత్పత్తి సంస్థలు
-50 మండలాల్లో కంది ఉత్పత్తి సంస్థలు
-రూ. 2,500 కోట్లతో సీసీ రోడ్లు
-4,383 కొత్త గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు
-పంచాయతీల్లో నాలుగు స్టాండింగ్ కమిటీలు
-పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat