కథానాయకులు నటించే సినిమాలకు వాల్యూ పెరిగితే వారి రెమ్యునరేషన్ కూడా బాగా పెరుగుతుందన్న విషయం అందరికి తెలిసిన విషయమే. కాలం పెరుగుతున్న కొద్దీ సినిమాల వాల్యూ చాలా వరకు రెట్టింపు అవుతుంది. కొన్ని సినిమాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. అయితే, ఈ ప్రపంచంలో హాలీవుడ్ సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరిగే హాలీవుడ్‌లో నటులకు కూడా అదే స్థాయిలో రెమ్యునరేషన్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక అసలు విషయానికొస్తే.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే నటులు ఎవరబ్బా..? అని ఆరా తీస్తే అందులో మొదటి పేరు జేమ్స్‌బాండ్ చిత్రం సిరీస్ హీరో డేనియల్ ఉన్నారట. అయితే, డేనియల్ నటించిన సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మాంచి గిరాకీ ఉన్న విషయం తెలిసిందే. ఇంతకీ డేనియల్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.450 కోట్లు. అవును. ఒక్క చిత్రంలో నటించినందుకు గాను డేనియల్ రూ.450 కోట్ల పారితోషకాన్ని అందుకుంటాడు.