ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేత జంగా కృష్ణమూర్తి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా ..ఇప్పటికే అధికార టీడీపీ పార్టీ నుండి వైసీపీలోకి వలసలు వస్తున్నా నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి టీడీపీ పార్టీలోకి వెళ్ళడం ఖాయామా ..తనపై పార్టీ మారుతున్నారు అని వస్తున్నా వార్తలపై జంగా కృష్ణమూర్తి స్పందించారు.
వైఎస్ జగన్ 179 వ రోజు ప్రజా సంకల్పయాత్ర
శుక్రవారం ఆయన నారాయణ పురంలో వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తను వైసీపీ పార్టీకి రాజీనామా చేసి అధికార టీడీపీ పార్టీలో చేరతాను అని అని వస్తున్నా వార్తలపై ఎటువంటి వాస్తవాలు లేవు .తనపై వస్తున్నా విషపు ప్రచారం నమ్మొద్దు .
తనపై కావాలనే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు కొంతమంది సోషల్ మీడియా ,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు ఆయన అన్నారు .తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు వైసీపీ పార్టీలో ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తాను అని ఆయన పార్టీ మార్పుపై వస్తున్నా వార్తలపై క్లారిటీ ఇచ్చారు .