లెజెండరీ హీరోయిన్ సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో మహానటి సావిత్రి దయాగుణం, దాతృత్వం గురించి తెలుసుకున్న సినీ ప్రేక్షకులు సావిత్రిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందరో జీవితాల్లో వెలుగులు నింపింది కాబట్టే.. సావిత్రి మహానటి అయిందని, లేకుంటే మరో నటి అయి ఉండేదని అంటున్నారు సినీ జనాలు.
కాంగ్రెస్ మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశార. సావిత్రి దానకర్ణురాలు అని అడిగిన వారికి, అడగని వారికి అనేక దాన ధర్మాలు చేసే వారని తెలిపారు. ఆమెదగ్గర పనిచేసేవారు ఆమెను మోసం చేసినా పట్టించుకోని గొప్ప మనసున్న వారని ప్రశంసించారు. తమ అమ్మగారితో సావిత్రితో మంచి అనుబంధం ఉండేదని, ఆ క్రమంలో తన తల్లితో కలిసి సావిత్రిని కలిసేవారమని చెప్పారు కాసు కృష్ణారెడ్డి.