జబర్దస్త్ నవ్వులు పూయించే కామెడీ షో అంటే అందరూ పడి చస్తారు. టాప్ రేటింగ్స్‌తో దూసుకెళుతున్న ఈ షో ప్రతీ గురు, శుక్ర వారాల్లో వస్తుందంటే జనాలు రాత్రి తొమ్మిదన్నర గంటలకల్లా టీవీల ముందు వాలిపోతారు. ఈ ప్రోగ్రామ్ చాలా మంది కమెడియన్లకు మంచి లైఫ్ ఇచ్చింది. తాజాగా సుధీర్, రష్మీల మధ్య కెమిస్ట్రీ రంజుగా సాగుతోంది. మొన్నటి ఉగాదికి వీరిద్దరికి తూ .. తూ మంత్రంగా పెళ్లి జరిపించిన జబర్దస్త్ టీమ్ ఆ తరువాత ఢీ 10 సాక్షిగా ఐ లవ్ యూ చెప్పే వరకు వ్యవహారం సాగింది.
ఒకరంటే మరొకరికి ప్రేమ అని అర్థం వచ్చేలా వీరి ప్రవర్తన షోలలో కనిపిస్తుంది. తాజాగా టెలికాస్ట్ అయిన జబర్దస్త్ ప్రోగ్రాంలో సుడిగాలి సుధీర్ టీమ్ ఫర్మా మ్ చేసింది. ఇందులో ఇందులో గెటప్ శీను ఒక కంపెనీకి మేనేజర్‌గా ఒక బెత్తం పట్టుకుని ఉంటాడు. సుధీర్, ఆటో రామ్ ప్రసాద్ ఉద్యోగులుగా ఉంటారు. బద్దకస్తులుగా ఉన్న వీరిద్దరిని గెటప్ శీను కొ డుతూ ఉంటాడు. అలా గెటప్ శీను సుధీర్‌ను కొ డుతుంటే రష్మీ తెగ ఎంజాయ్ చేసింది. సుడిగాలి సుధీర్‌ను అంతలా కొడుతుంటే గెటప్ శీనును ఎంకరేజ్ చేసింది రష్మీ. అయితే, స్కిట్ ముగిసిన తరువాత సుడిగాలి సుధీర్ మమ్మల్ని కొడుతుంటే ఎంజాయ్ చేస్తుంటావా..? అంటూ రష్మీపై సుడిగాలి సుధీర్ ఫైర్ అయ్యాడు. ఇలా సుడిగాలి సుధీర్ అన్న ఆ ఒక్కమాటకు రష్మీ వలవలా అంటూ ఏడ్చేసింది.