టీడీపీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఓటుకు నోటు కేసుతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా మరో కొత్త అంశం ఆయనకు చికాకు పుట్టించేలా ఉంది. ఎయిర్ ఏషియా లైసెన్స్‌ల కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా వచ్చింది.ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది.కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు ఉన్నప్పుడు ఎయిర్ ఏషియాకు అంతర్జాతీయ విమాన కార్యకలాపాలకు సంబంధించిన లైసెన్స్‌ల వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేపు ఒక్కసారిగా బయటకు వచ్చింది.
ఘోర రోడ్డు ప్రమాదం..!
అయితే ఈ ఆడియో టేపులు బయటపడడంతో పలు ఆంగ్ల దినపత్రికలు కథనాలను ప్రచురించాయి. ఇంటర్నేషనల్ ఆపరేషన్ లైసెన్స్‌ల కోసం భారత ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోని ఫెర్నాండజ్, సంస్థ ఇండియా సీఈవో మిట్టు శాండిల్య మధ్య 33 నిమిషాల పాటు సాగిన ఈ ఆడియో సంభాషణలో పలు సంచలన విషయాలు ఉన్నాయి.ఇప్పటికే ఫెర్నాండజ్‌పై ఎఫ్‌ఐఆర్‌ను కూడా సీబీఐ నమోదు చేసింది. అనుమతుల కోసం విమానయాన శాఖ అధికారులకు, మరికొందరికి భారీగా లంచాలు ఇచ్చినట్టు ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ వెల్లడించింది. ఇప్పుడు తాజాగా ఆడియో టేపు కూడా బయటకు వచ్చింది.
ఎన్నికలు ముగిసేంత వరకూ..ఈనాడు, ఆంధ్రజ్యోతి చూడొద్దు..ఎందుకంటే
ఈ ఆడియో టేపులో చంద్రబాబు, అశోక్‌గజపతిరాజు ప్రస్తావన కూడా వచ్చింది. చంద్రబాబుతో వ్యవహారాన్ని నైస్‌గా ప్లే చేస్తే మనం అన్నీ సాధించుకోవచ్చు అంటూ మిట్టు… ఫెర్నాడేజ్‌తో చెప్పడం ఆడియో టేపులో ఉంది. ఇదే విషయాన్ని ఆంగ్ల పత్రికలు వెల్లడించాయి.అయితే ఈ కుంభకోణంలో ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ… నాటి విమానయాన శాఖమంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజును కూడా విచారిస్తుందా.. చంద్రబాబు ప్రమేయంపై ఆరా తీస్తుందా అన్నది తేలాల్సి ఉంది.ఈ కేసులో ఎయిర్ ఏషియా సీఈవో ఫెర్నాండెజ్ బుధవారం సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు.