భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు సహాయం చేస్తున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముస్లింలందరికీ భరోసా వచ్చిందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని ప్రజ్ఞ గార్డెన్స్‌లో రంజాన్ సందర్భంగా వెయ్యి మంది పేద ముస్లిం కుటుంబాలకు బట్టలు, 425 మంది కుటుంబాలకు బియ్యం, సరుకులను పంపిణీ చేశారు. 200 మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
Distributed Ramzan gifts to poor Muslims families to celebrate Ramzan with much delight at Gajwel of Siddipet District. pic.twitter.com/7kQ55UJIdy
— Harish Rao Thanneeru (@trsharish) June 4, 2018
ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. గజ్వేల్ లో కోటి రూపాయలతో షాదీఖానను ఏర్పాటు చేశామన్నారు. షాదీఖానలో అదనంగా కిచెన్ షెడ్, కంపౌడ్ వాల్, భోజన శాల నిర్మాణాలు చేపట్టేందుకు మరో కోటి రూపాయల నిధులు పది రోజుల్లో మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్ రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్ పాల్గొన్నారు.