జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. పవన్ గురించి నేను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ చెప్పడం, అందుకు పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అయి.. ఆ వెంటనే అల్లు అర్జున్ వీడియోలకు డిస్ లైక్స్ కొట్టడం వంటి పరిణామాలు చాలానే జరిగాయి. అయితే, ఇటీవల కాలంలో అల్లు అర్జున్ పవన్‌పై తీసుకున్న యూటర్న్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని తగ్గించగలిగాడు. మేమంతా ఒక్కటే అనేంతలా శ్రీరెడ్డి వ్యహారంలో పవన్‌కు బన్నీ మద్దతు ఇచ్చాడు.
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ తాజాగా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు వైరల్ అయింది. అల్లు అర్జున్ జనసేన పార్టీకి, పవన్‌కు మద్దతు తెలుపుతూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రజా సేవ చేయాలనే మీ ఆకాంక్షకు తగ్గట్టు ఉండండి.. ప్రపంచమే మీ వెంట నడుస్తుంది అంటూ కామెంట్ పెట్టాడు. అయితే, ఈ కామెంట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది.