కోలీవుడ్ స్టార్ హీరో శింబు షూటింగ్ స్పాట్‌కు సమయానికి రాడు, అంతేకాక దర్శక నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తాడు అంటూ ఇటీవల వస్తున్న వదంతులపై హీరో శింబు ఇవాళ స్పందించారు. ఆ వదంతులపై హీరో శింబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేను రోబోను కాదంటూ ఘాటైన సమాధానం చెప్పాడు. తన తండ్రి సినిమా చేసే సమయంలోనే షూటింగ్ సెట్‌కు 10 గంటలకే వెళ్లానని చెప్పుకొచ్చాడు హీరో శింబు.
నాకు నచ్చినట్టే నేను ఉంటానంటూ, నన్ను ఎంతో గారాబంగా పెంచారు. స్వేచ్ఛగా పెరిగాను శింబు చెప్పాడు. తల్లిదండ్రుల ఆస్తి కాకుండా, తన సొంతంగా వెయ్యి కోట్ల ఆస్తిని సంపాదించినట్లు మీడియా సాక్షిగా శింబు చెప్పాడు.