తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వమే నిర్వహించనుంది. వైద్య ఆరోగ్య సేవలను విస్తృతం చేస్తూ, మెరుగు పరచడం కోసం ప్రభుత్వ ప్రవేశ పెట్టిన అనేక పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. సర్కార్ దవాఖానాల ద్వారా వైద్య సేవలు పొందే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. వాళ్ళకి మరింత మెరుగైన, సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలు కూడా అందించేందుకు తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ని ప్రారంభిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.అందులోభాగంగానే ఇవాళ
Ministers Laxma Reddy and @KTRTRS inaugurated ‘Telangana Diagnostics Central Hub’ at Institute Of Preventive Medicine (IPM) Campus in Hyderabad today. pic.twitter.com/Yq87XudUTb
— Min IT, Telangana (@MinIT_Telangana) June 9, 2018
హైదరాబాద్‌లోని నారాయణగూడలో ఐపీఎం క్యాంపస్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంట్రల్ హబ్‌ను మంత్రులు కేటీఆర్, లకా్ష్మరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డయాలసిస్ సెంటర్లు ప్రారంభించాం. కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 40-50శాతం పెరిగింది. పట్టణంలోని పేదవారి కోసం బస్తీ దవాఖానాలు ప్రారంభించాం. ప్రస్తుతం 17 బస్తీ దవాఖానాలు నడుస్తున్నాయి. సామాన్యులకు పైసా ఖర్చుకాకుండా తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌లో పరీక్షలు ఉచితంగా వైద్య పరీక్షలు చేసుకోవచ్చని కేటీఆర్ తెలిపారు.
see also: నాగలి పట్టి ..దుక్కి దున్నిన స్పీకర్