ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.తమ రాజీనామాలను ఆమోదించాలని ఈ ఐదుగురు ఎంపీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ముందు హాజరై కోరారు .అయితే స్పెషల్ స్టేటస్ కోసం రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి ,అవినాష్ రెడ్డి ,మిథున్ రెడ్డి ,వైవీ సుబ్బారెడ్డి ,వరప్రసాదరావు ల రాజీనామాలను లోక్ సభ స్పీకర్ ఆమోదించారు కూడా .లోక్ సభ ఎన్నికలకు మరో
ఏడాది సమయం ఉండగానే ఆరు నెలలకు ముందే ఉప ఎన్నికలు జరుగుతాయి అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.
see also:జగన్ మరో సంచలనం..!
ఈ క్రమంలో ఉప ఎన్నికలు జరిగితే మరల వైసీపీ తరపున బరిలోకి దిగే అభ్యర్థులు గెలుస్తారా ..లేదా అధికార టీడీపీ పార్టీ తరపున నిలబడే అభ్యర్థులు గెలుపొందుతారా అనే అంశం గురించి ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే చేసిందని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుండి వైసీపీ తరపున వై.వి.సుబ్బారెడ్డి 15,535 మెజారిటీతో , నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుండి మేకపాటి రాజమోహన్ రెడ్డి 20,000 ఓట్ల మెజారిటీతో ,తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం నుండి వి.వరప్రసాదరావు 35,958 మెజారిటీతో గెలుపొందారు .ఇక రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుండి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి,కడప నుండి వై.ఎస్.అవినాశ్ రెడ్డి గెలుపొందారు.అయితే మొత్తం ఎనిమిది మంది వైసీపీ తరపున గెలుపొందగా ముగ్గురు బుట్టా రేణుక ,కొత్తపల్లి గీత ,ఎస్పీవైరెడ్డి టీడీపీ పార్టీలో చేరారు.ఇకపోతే స్పెషల్ స్టేటస్ కోసం రాజీనామా చేయడంతో ఐదు స్థానాలకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికీ పట్టం కడతారు అనే అంశం మీద చేసిన సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి .
see also:వైసీపీలోకి మొన్న గంగుల,నిన్న శిల్పా బ్రదర్స్..నేడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి…కోట్ల సుజాతమ్మ
గత సార్వత్రిక ఎన్నికల్లో తమ మిత్రపక్షాన్ని గెలిపిస్తే ఐదేళ్ళు కాదు పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు స్పెషల్ స్టేటస్ ఇస్తామని ..పోలవరం కేంద్రం నిధులతో కట్టిస్తామని ..రాజధానిని ఢిల్లీకి మించి అభివృద్ధి చేస్తామని ఇలా పలు హామీలను కురిపించి కల్సి పోటిచేశాయి టీడీపీ ,బీజేపీ ద్వయం.అయితే అధికారాన్ని చేపట్టిన తర్వాత గత నాలుగు ఏండ్లుగా ఆ హామీలను నెరవేర్చడంలో టీడీపీ ,బీజేపీ పార్టీలు విఫలం కావడం ..వాటిని అమలు చేయాలనీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ చేయని పోరాటం లేదు.చేయని ఉద్యమం లేదు .అంతే కాకుండా ఏకంగా స్పెషల్ స్టేటస్ కావాలని డిమాండ్ చేస్తూ తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు ఆ పార్టీ ఎంపీలు .
see also:ఆ విషయంలో బాబుకు “64%”మంది జై కొట్టారు -జాతీయ మీడియా సర్వే..!
ఇలా తమ పదవులను త్యాగం చేయడంతో ప్రజల్లో ఆ పార్టీ మీద నమ్మకం పీక్ స్థాయిలో చేరుకుంది.మరోపక్క నాలుగు ఏళ్ళ పాటు కల్సి సకల సౌకర్యాలను అనుభవించి తీరా ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పడం తదితర అంశాలు ప్రజల్లో టీడీపీ పై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది.దీంతో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే టీడీపీ తరపున ఎవరు బరిలోకి దిగిన సరే డిపాజిట్లు కూడా దక్కకుండా చిత్తుచిత్తుగా ఓడించి ..స్పెషల్ స్టేటస్ కోసం నాలుగేళ్ళుగా ఎడతెరగని పోరాటం చేయడమే కాకుండా ఏకంగా ఎంపీ పదవులను త్యాగం చేసిన ఆ ఐదుగురికే మరల పట్టం కట్టడమే కాకుండా ఏకంగా దేశంలో ఇంతవరకు ఎవరికి ఏ పార్టీ అభ్యర్థికి దక్కని విధంగా రికార్డు స్థాయిలో మెజారిటీను కట్టబెట్టి స్పెషల్ స్టేటస్ పై ఐదున్నర కోట్ల ఆంధ్రుల వాణిని దేశానికి తెలియజేసేలా ఓట్లు వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఆ సర్వేలో తేలింది అని వార్తలు వస్తున్నాయి .ఏది ఏమైనా ఏపీ ప్రజలు చాలా విజ్ఞులు ..తమ తరపున ఎవరున్నారో ..ఎవరు లేరో తెలుసుకొని టైమ్స్ అఫ్ ఇండియా చేసినట్లు వచ్చిన వార్తలో మాదిరిగా ఉప ఎన్నికల్లో తీర్పునివ్వడం ఖాయం ..