Home / SLIDER / ఇద్దరు ఇద్దరే ..!

ఇద్దరు ఇద్దరే ..!

ఒకరేమో మాస్ ..మరో ఒకరు క్లాస్ ..ఒకరేమో ఎప్పుడు ఉపఎన్నికలు జరిగిన ట్రబుల్ షూటర్ అవతారమెత్తి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బంపర్ మెజారిటీతో గెలుపును ఖాయం చేసే ట్రబుల్ షూటర్ .ఇంకొకరేమో ఐటీ రంగంలో పెనుమార్పులు తీసుకువస్తూ దేశంలో ఏ రాష్ట్రానికి రాని  పెట్టుబడులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తూ యువతకు ఉపాధిని కల్పిస్తూ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్న యువనేత .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ..వారే తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ..మరొకరు యూత్ ఐకాన్ ,”బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియన్ ఐటీ “మంత్రి కేటీఆర్ .

SEE ALSO:హ్యాట్సాఫ్ ఎంపీ బాల్క సుమన్..!!

తాజాగా వీరిద్దరూ తమకున్న రాజకీయ చాతుర్యత ,అనుభవాన్ని అంతటా రంగుకరించి మరోసారి ఘనవిజయం సాధించారు.గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కి చెందిన ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని నిరసిస్తూ ఈ నెల పదకొండో తారీఖు అంటే ఈ రోజు సోమవారం నుండి స్ట్రైక్ చేయాలనీ నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే .అయితే రంగంలోకి దిగిన మంత్రులు హరీష్ ,కేటీఆర్ ఉద్యోగులతో ,ఉద్యోగ సంఘాలతో పలు దపాలుగా చర్చలు జరిపి ..వారికి నచ్చచెప్పి డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి సమ్మెను విరమించుకునేలా చేయడంలో ఘనవిజయం సాధించారు.

SEE ALSO: రోజు నుంచే రైతు బీమా పథకం వివరాలు సేకరణ

అంతే కాకుండా న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడమే కాకుండా ఏకంగా పదహారు శాతం మధ్యంతర భృతిని ఇస్తామని కూడా ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు సదరు మంత్రులు .ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ రావుపై పొగడ్తలు కురిపించారు.అందులో భాగంగా మంత్రి కేటీఆర్ హరీష్ రావును ఉద్దేశిస్తూ “ఒకవైపు రాష్ట్ర క్యాబినెట్ లో కీలక మంత్రిగా ఉంటూనే మరోవైపు కార్మిక సంఘం అయిన టీఎంయూకు గౌరవ అధ్యక్షుడుగా ఉన్నారు మంత్రి హరీష్ రావు .ఇటు ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అటు తనను నమ్మి అధ్యక్ష పదవీని కట్టబెట్టిన కార్మికులను అన్యాయం జరగకుండా విజయం సాధించడంలో నిర్వహించిన ద్విపాత్రాభినయం సూపర్ ..గౌరవ అధ్యక్షుడిగా చర్చలను సఫలం చేయడంలో సహకరించిన మంత్రి హరీష్ రావు కు ప్రత్యేక కృతఙ్ఞతలు అంటూ చెప్పి మంత్రి కేటీఆర్ మంత్రి హరీష్ పై ప్రశంసల వర్షం కురిపించారు .

SEE ALSO:ఈ ఎమ్మెల్యే కేటీఆర్ మ‌న‌సును ఎందుకు గెలుచుకున్నాడంటే..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat