ఆదాయాన్ని దాచిపెట్టి ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారన్న ఆరోపణలపై ప్రముఖ సినీ నటి త్రిషకు ఆ శాఖ విధించిన అపరాధ రుసుము రద్దు సబబేనంటూ హైకోర్టు ప్రథమ ధర్మాసనం తీర్పును వెలువరించింది. నటి త్రిష 2010 – 11వ సంవత్సరంలో తనకు లభించిన 3 కోట్ల 51 లక్షల ను చూపకుండా ఐటీ రిటర్న్స్‌ను దాఖలు చేసిందని ఆరోపిస్తూ ఆదాయపన్నులశాఖ 2013 సెప్టెంబర్‌లో త్రిషకు రూ.16 లక్షల పైచిలుకు జరిమానా విధించింది.
see also:నీ మొగుడు నువ్వు అనుకున్నంత శ్రీ రామ చంద్రుడు కాదమ్మా..నాతో పడుకున్నాడు
అయితే, 2010 – 11 సంవత్సరాల్లో తాను సినిమాల్లో నటించేందుకు తీసుకున్న అడ్వాన్సులను 2012 – 13లో సవరించి సమర్పించిన ఐటీ రిటర్న్స్‌లో లెక్కగట్టి చూపానని, ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండానే తనకు అపరాధం విధించారంటూ త్రిష ఐటీ కమిషనర్ వద్ద ఫిర్యాదు చేశారు. ఆ మేరకు త్రిషకు విధించిన అపరాధ రుసుమును ఐటీ కమిషనర్ రద్దు చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఐటీశాఖ హైకోర్టును ఆశ్రయించింది.. హైకోర్టు కూడా త్రిషకు విధించిన అపరాధ రుసమును రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.