అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న యువ నటుడు విజయ్ దేవరకొండ..మరోసారి తన గొప్ప మనస్సుతో సామాన్య ప్రజలకు దగ్గర కాబోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ నటనకు శనివారం జరిగిన ఫిల్మ్‌ఫేర్ వేడుకలో విజయ్‌కు ఉత్తమ కథానాయకుడి అవార్డు వచ్చింది. ఈ క్రమంలోనే విజయ్ ఆ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు.ఈ విషయాన్నీ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో పంచుకున్నాడు.
Roju Twitter lo Chusta, entho mandi help adigithe, @KTRTRS anna CMRF nundi help chestaru. If my first award can be auctioned and money/awareness can be raised towards this, That'll be an epic 1st award.
— Vijay Deverakonda (@TheDeverakonda) June 17, 2018
ఈ సందర్భంగా విజయ్ ట్వీట్ చేస్తూ..‘‘ప్రతి రోజూ ట్విట్టర్లో చూస్తా, ఎంతో మంది సాయం కోరితే కేటీఆర్ అన్న సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సాయం చేస్తారు. నా తొలి అవార్డు వేలంలో అమ్ముడుపోతే ఆ డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేస్తాను. ప్రజల్లోనూ అవగాహన వస్తుంది కదా.. ఈ అవార్డ్ ఒక బోనస్… దీన్ని ఇంట్లో షెల్ఫ్ మీద ఉంచడం కంటే నేను పుట్టిన ఈ సిటీకి ఇది మరింత ఉపయోగకరం.. వాళ్లు అంగీకరిస్తే రేపే వెళ్లి ఇచ్చేస్తా’ అని విజయ్ ట్వీట్ చేశాడు.
Vijay, many congratulations on winning your first Filmfare ?
Delighted you want to support the Chief Minister’s relief fund. My compliments to your thoughtful gesture?
Let me revert on how we can go about this. Congrats again https://t.co/oObPZqBAEU
— KTR (@KTRTRS) June 17, 2018
అయితే విజయ్ చేసిన ట్వీట్ ను మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేసి అభినందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి సాయం చేయాలని అనుకోవడం ఆనందంగా ఉందన్నారు. అంతేకాకుండా విజయ్ భావోద్వేగంలో మరొక ట్వీట్ చేసి మమ్మీడాడీలకు సొంతిల్లు కొన్నప్పుడు గెలిచినట్టు అనిపించిందని అన్నాడు. అయితే చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి దిగ్గజాలతో పోటీపడి మరీ విజయ్ ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం..కాగా అర్జున్ రెడ్డి సినిమాను మంత్రి కేటీఆర్ చూసి అభినందించిన విషయం తెలిసిందే..