చికాగో సెక్స్ రాకెట్ కేవలం తెలుగు సినీ ఇండస్ట్రీనే కాకుండా, కోలీవుడ్, శాండిల్ వుడ్, మాలీవుడ్ ఇలా యావత్ సినీ ప్రపంచాన్నే ఓ కుదుపు కుదిపింది. గతంలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కో ప్రొడ్యూసర్‌గా, అలాగే, హీరో, హీరోయిన్లకు మేనేజర్‌గా వ్యవహరించిన మోదుగుల కిషన్, చంద్రకళ దంపతులు చికాగాలో నిర్వహిస్తున్న సెక్స్‌రాకెట్ గుట్టు బట్ట బయలు కావడంతో సినీ ప్రపంచం ఉలిక్కిపడింది. టాలీవుడ్ ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి హీరోయిన్లతో బూతుభాగోతం నడిపిస్తున్నట్టు పోలీసుల విచారణలో వారు అంగీకరించారు.
see also:అమెరికా సెక్స్ రాకెట్ లో హీరోయిన్ల పేర్లు లీక్..ముంబాయి ఏయిర్‌పోర్టులో హన్సిక వీడియో హల్ చల్
ఈ విషయంపై కన్నడ సినీ నటి అమృత స్పందించారు. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. గత సంవత్సరం డిసెంబర్ లో అర్థరాత్రి 12 గంటల సమయంలో మోదుగుల కిషన్, చంద్రకళ నుంచి తనకు ఫోన్ చేశారని, డిసెంబర్ 31 వేడుకలకు తమ వద్ద మంచి ఆఫర్ ఉందని తనకు చెప్పారని తెలిపింది. ఇంకోసారి ఇటువంటి ఫోన్స్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వారిని హెచ్చరించాను. అయినా వారు నాతో చాలా సార్లు అసభ్యంగా మాట్లాడారు. దీంతో వారి నెంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టానని ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది నటి అమృత.