ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ పద్మశ్రీ డా. నేరేళ్ల వేణుమాధవ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిమిక్రీ కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. మిమిక్రీ కలను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి మిమిక్రీ కలకు పితామహుడిగా పేరొందారన్నారు. ఆయన మృతి కలారంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
see also:పద్మశ్రీ నేరేళ్ళ వేణుమాధవ్ మృతి..!!
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడిన వేణుమాధవ్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. 1932 డిసెంబర్ 28న మట్టెవాడలో వేణుమాధవ్ జన్మించారు. 1972 నుంచి 1978 వరకు వేణుమాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి అందరి ప్రసంశలు అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేరేళ్ల వేణుమాధవ్ ను విశిష్ట పురస్కారంతో గౌరవించింది.
see also:వరికోల్ గ్రామానికి రూ.5.75కోట్లు మంజూరు..!!
వేణుమాధవ్ అంత్య క్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ ని సీఎం కేసీఆర్ ఆదేశించారు.