Home / Tag Archives: Death

Tag Archives: Death

సైదాబాద్ చిన్నారి హ‌త్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య

తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హ‌త్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. వ‌రంగ‌ల్ జిల్లాలోని న‌ష్‌క‌ల్‌ రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. చేతిపై ఉన్న టాటూను చూసి నిందితుడు రాజును పోలీసులు గుర్తించారు.

Read More »

GHMC మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ ఆకస్మిక మరణం

గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ రాజ్ కుమార్ గుండె పోటుతో ఆకస్మిక మరణం పాలయ్యారు. రాజ్ కుమార్ మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. క్రమశిక్షణతో పార్టీ కోసం పని చేసిన రాజ్ కుమార్ …

Read More »

రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. మృతులు ఖమరుద్దీన్, జమీల్, బబ్లూగా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ కాగా.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Read More »

చనిపోయాడని అంత్యక్రియలు చేస్తే..లేచి తిరిగోచ్చాడు..

రాజ‌స్థాన్‌లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. చ‌నిపోయాడ‌ని ఓ వ్య‌క్తికి అంత్య క్రియ‌లు నిర్వ‌హిస్తే వారం త‌ర్వాత ఆ వ్య‌క్తి ఇంటికి వ‌చ్చిన ఘ‌ట‌న తాజాగా బ‌య‌ట‌ప‌డింది. రాజ్‌స‌మంద్ జిల్లాలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాష్ట్ర ప్ర‌భుత్వ ద‌వాఖాన ఆర్కే హాస్పిట‌ల్‌లో మ‌ర‌ణించిన గోవ‌ర్ద‌న్ ప్ర‌జాప‌తి మ్రుత‌దేహాన్ని పొర‌పాటున ఓంకార్ లాల్ గడులియా బంధువులు తీసుకెళ్లార‌ని విచార‌ణ‌లో తేలింది. వారిద్ద‌రూ అదే ద‌వాఖాన‌లో చికిత్స పొందారు. అస‌లు క‌థేమిటంటే ఓంకార్ …

Read More »

అజిత్ సింగ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సిఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ …

Read More »

మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు.

మాజీ ఎంపీ సబ్బంహరి ఇక లేరు. కరోనాతో బాధపడుతున్న ఆయన నేడు పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఏప్రిల్ 15న సబ్బం హరికి కరోనా సోకడంతో తొలుత ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తరువాత ఆయన విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అనంతరం సబ్బంహరి పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు. నేటి ఉదయం నుంచే ఆయన పరిస్థితి మరింత విషమంగా …

Read More »

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి

అనంతపురం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, హిందూపురం మాజీ ఎమ్మెల్యే కామగానహళ్లి తిప్పేస్వామి(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిగి మండలం సేవా మందిరంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1941లో ఏప్రిల్ 6న జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సేవా మందిర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సొంత స్థలంలో …

Read More »

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కుటుంబంలో విషాదం

భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం – సోదరుడు కన్నుమూశారు. కలాం పెద్దన్నయ్య మహ్మద్ ముత్తుమీరా(104) రామేశ్వరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ముత్తుమీరా మృతికి తెలంగాణ గవర్నర్ తమిళి సై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read More »

సినీ న‌టుడు కాంతారావు స‌తీమ‌ణి క‌న్నుమూత

అనాటి హీరోల‌లో కాంతారావుకు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఎన్నో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి అభిమానుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. 2009 మార్చి 22న ఆయ‌న మ‌ర‌ణించారు. ఈ రోజు మ‌ధ్యాహ్నాం 12 గంట‌ల స‌మ‌యంలో కాంతారావు స‌తీమ‌ణి హైమావ‌తి(87) గుండెపోటుతో మ‌ర‌ణించారు. మ‌ల్లాపూర్‌లో ఉన్న వారి నివాసంలోనే ఆమె స్వ‌ర్గ‌స్తుల‌య్యారు. హైమావతి మృతికి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. కాగా,  …

Read More »

ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి మృతి

ప్రముఖ పాటల, మాటల రచయిత వెన్నెలకంటి (64) ఇక లేరు. గుండెపోటుతో ఆయన ఈరోజు(మంగళవారం) చెన్నైలో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్‌. వెన్నెలకంటిగానే ఆయన అందరికీ పరిచయం. తమిళ చిత్రాలను తెలుగులో అనువాదం చేసే విషయంలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండేది. లిరిసిస్ట్‌గానూ ఆయన ఎన్నో పాటలను రచించారు. మొత్తంగా ఆయన 1000కి పైగా చిత్రాలకు పని చేశారు. ఆదిత్య 369, క్రిమినల్‌, …

Read More »