సినీ తారలకు చీకటి వ్యవహారాలకు కొత్త అడ్డా దొరికిందా..? నిన్నటి వరకు బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లో వ్యభిచారం నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోయే తారలు ఇప్పుడు విదేశాల వైపు దృష్టి సారించారా..? తాజాగా చికాగో వంటి మహానగరంలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్‌లో తెలుగు స్టార్ హీరోయిన్స్ పట్టుబడటం పలు అనుమానాలకు తావిస్తోంది.
see also:నా కొడుకును జూనియర్ పవర్ స్టార్ అంటే బ్లాక్ చేస్తా..!!
అయితే, చికాగో పోలీసుల విచారణలో ఇప్పటి వరకు ఆరుగురు తెలుగు స్టార్ హీరోయిన్స్ పేర్లు బయటకు వచ్చాయని తెలుస్తోంది. అంతేకాకుండా, ఆ ఆరుగురు స్టార్ హీరోయిన్స్ ఇప్పటి వరకు ఏఏ కారణాలతో అమెరికాకు వచ్చారో..? వారు బంధువుల ఇంటికెళ్లారా..? లేక హోటల్స్‌కు వెళ్లారా..? ఎవరెవరిని కలుసుకున్నారు..? అన్న విషయాలపై చికాగో పోలీసులు ఆరా తీస్తున్నారు.
see also:‘ఈ నగరానికి ఏమైంది?’ సినిమా విడుదల ఎప్పుడో తెలుసా..?
ఇదిలా ఉండగా, టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరోయిన్‌పై చికాగో పోలీసులు ఐదేళ్లపాటు నిషేధం విధించినట్టు తెలుస్తోంది. ఆ విషయానికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న కిషన్, చంద్రకళ దంపతులను పోలీసులు జనవరిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే వారి నుంచి కొన్ని కీలక పత్రాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ఆ పత్రాల్లో ఏఏ హీరోయిన్‌కు ఎంత చెల్లింపులు చేశారన్న విషయాన్ని వివరాలతో సహా కూలంకుషంగా పేర్కొన్నారట కిషన్ దంపతులు. ఆ సమాచారం మేరకు సెక్స్‌రాకెట్‌లో పట్టుబడిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌పై చాకాగో పోలీసులు ఐదేళ్లపాటు నిషేధం విధించారని, ఆ నిషేధం ప్రకారం ఆ స్టార్ హీరోయిన్ ఐదేళ్లపాటు అమెరికాకు వెళ్లే అవకాశమే లేదని సమాచారం. ఇలా ఆ స్టార్ హీరోయిన్‌పై ఐదేళ్లపాటు నిషేధం విధించినట్టు సమాచారం తెలుసుకున్న టాలీవుడ్ బఢా ప్రముఖుల గుండెళ్లో రైళ్లు పరుగెత్తుతున్నాయంటూ కామెంట్ల వర్షం కురిపించడం చిత్రపురి కాలనీ వాసుల వంతైంది.