Home / MOVIES / బిగ్‌బాస్ – 2 విన్న‌ర్ ఎవ‌రో తెలిస్తే షాక్ అవుతారు..!

బిగ్‌బాస్ – 2 విన్న‌ర్ ఎవ‌రో తెలిస్తే షాక్ అవుతారు..!

తెలుగులో పోయిన ఏడాది మొద‌లైన రియాల్టీ షో బుల్లితెర‌పై సూప‌ర్ స‌క్సెస్ రేటింగ్‌ను సాధించింది. న‌ట రుద్రుడు ఎన్టీఆర్ హోస్టింగ్ టాలెంట్‌తో బిగ్ బాస్ మొద‌టి సీజ‌న్ టీవీ రేటింగ్‌ల‌లో దూసుకు పోయింది. అయితే, ఈ ఏడాది జూన్ 10వ తేదీ నుంచి బిగ్ బాస్ రెండో సీజ‌న్ మొద‌లైన విష‌యం తెలిసిందే. ఈ రియాల్టీ షోలో హౌస్‌లో మొత్తం 16 మంది ఉన్నారు. ఒక్కొక్క‌రు ఒక్కోలా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. మ‌రికొంద‌రు .. ప‌క్క‌వాళ్ల‌తో గొడ‌వ ప‌డుతున్నారు.

ఇదిలా ఉండ‌గా, బిగ్ బాస్ -2 సీజ‌న్‌లో చివ‌ర‌కు గెలిచేది ఎవ‌రు..? అన్న అంశంపై ఇప్ప‌టికే జోరుగా బెట్టింగ్‌లు కూడా జ‌రుగుతున్నాయ‌ని చిత్ర‌పురి కాల‌నీ వాసుల టాక్‌. ఈ క్ర‌మంలోనే మాన‌వ‌తావాది బాబు గోగినేని బిగ బాస్ -2 సీజ‌న్ విన్న‌ర్ కాబోతున్నాడ‌ని, అత‌నిపైనే ఎక్కువ బెట్టింగ్‌లు కూడా జ‌రిగాయ‌ని స‌మాచారం. దీనికంత‌టికి కార‌ణం బాబు గోగినేని బిగ్‌బాస్‌ను తిట్ట‌డ‌మేన‌ట‌. బిగ్ బాస్ రారా బ‌య‌ట‌కు అంటూ బాబుగోగినేని గ‌తంలో టెలికాస్ట్ అయిన షోలో తిట్టిన విష‌యం తెలిసిందే.

ఇప్పుడు ఆదే అంవాన్ని బేరీజు వేసుకున్న బుల్లితెర ప్రేక్ష‌కులు బాబు గోగినేనినే సీజ‌న్ -2 విన్న‌ర్‌గా తేల్చేస్తున్నారు. అదెలా అంటే…? సీజ్ – 1 రియాల్టీ షోలో శివ‌బాలాజీ హౌస్‌లో ఉన్న స‌మ‌యంలో బాత్‌రూమ్ లో నీళ్లు మ‌ట్టి.. మ‌ట్టిగా రావ‌డంతో.. ఇడియ‌ట్, రాస్కెల్ అంటూ బిగ్ బాస్‌ను తిట్టిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అదే రీతిలో బాబుగోగినేని కూడా బిగ్‌బాస్‌ను తిట్టాడు గ‌నుక సీజ‌న్ -2 విన్న‌ర్ కూడా అత‌డేన‌ని వినికిడి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat