తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి దానం నాగేందర్ శుక్రవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా అయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ పై పలు సంచలన వాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ లో బడుగు ,బలహీన వర్గాల నేతలకు ప్రాధాన్యత లేదు.కాంగ్రెస్ లో ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఇప్పటివరకు డిల్లీ చుట్టూ తిరిగే నాయకులకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు.ఈ విషయాల్ని పార్టీ హైకమాండ్ కు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రేటర్ ఎన్నికల్లో తనకు తెలియకుండానే టికెట్లు ఇచ్చారని అన్నారు.30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ లో పనిచేశానని చెప్పారు.పార్టీ లో బీసీ లకు ప్రాధాన్యం ఇవ్వాలని రాహుల్ ను కోరా అని..రాహుల్ నివేదిక ఇవ్వాలని అన్నారు. పార్టీ లో జరిగిన పరిణామాలు విశ్వాసం సన్నగిల్లేలా చేశాయని.. వీహెచ్ పార్టీ లో కక్కలేక మింగలేక ఉన్నారని..పొన్నాలకు పార్టీ లో సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. రోజు జెండా మోసే కార్యకర్తలు మాత్రం మనోవేదన చెందుతున్నారనిఅన్నారు పీసీసీ అధ్యక్షుడికే గాంధీ భవన్ లో ఏం జరుగుతుందో తెలియడం లేదంటూ.. దానం సంచలన వాఖ్యలు చేశారు.
