ఎన్నికలు సమీపిస్తున్న వేళ..రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయం వేడెక్కింది.నేతలందరు ఇప్పటినుండే తమ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటున్నారు.అందులోభాగంగానే రానున్న ఎన్నికల్లో మళ్ళీ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గెలవబోతుదనే ధీమాతో ఇప్పటికే వివిధ పార్టీలోని నేతలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి మాజీమంత్రి దానం నాగేందర్ రాజీనామా చేసి కారేక్కేందుకు సిద్ధమయ్యారు.
అయితే కాంగ్రెస్ పార్టీ కి దానం చేసిన రాజీనామా మరువకముందే మరో సీనియర్ నేత కూడా ఆ పార్టీకి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. చాలా రోజులుగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ పార్టీ మారుతాడని వస్తున్నవార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఆ వార్తలకు చెక్ పెట్టేందుకు ఆయన తన కుమారుడుతో కలిసి త్వరలోనే కారెక్కేందుకు సిద్ధమయ్యారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కడంలేదనే అసంతృప్తితో ముకేశ్ గౌడ్ పార్టీ మరబోతున్నారని వార్తలు వస్తున్నాయి.. అయితే కీలకనేతలు రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ వీడుతుండటంతో ఏం చెయ్యాలో తోచక సీనియర్ నేతలందరు డైలమోలో పడ్డారు.