ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు, ప్రత్యేక హోదా సాధన కమిటీ నేత చలసాని శ్రీనివాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ ప్రజల అభివృద్ధికి ఎంతో అవసరమైన ప్రత్యేక హోదా సాధన విషయంలో జగన్ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. కాగా, ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ లాంటి పోరాట పఠిమను నాడు దివంగత ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, వైఎస్ఆర్‌లలో చూశానని, ఇప్పుడు జగన్‌ను చూస్తుంటే వారిద్దరూ కనిపిస్తున్నట్టు చలసాని శ్రీనివాస్ అన్నారు.
see also:చంద్రబాబు గుండెల్లో దడ పుట్టిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర..!
సర్పంచ్ పదవిని వదులుకునేందుకే ఒకటికి పది సార్లు ఆలోచించే ఈ రోజుల్లో ఏపీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ఎంపీ పదవులను తృణప్రాయంగా వదులుకోవడం వైసీపీ నేతలకే చెందిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు అవలంభిస్తున్న రెండునాల్కుల ధోరణిని ప్రజలు గమనిస్తున్నారని, ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా..? హోదా వద్దు.. ప్యాకేజీనే ముద్దు.! కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటాదా..?
see also:వైఎస్ జగన్ అంటే ఎనలేని అభిమానం..జొన్నలగడ్డ శ్రీనివాసరావు
అంటూ హోదాను మరిచి ప్రత్యేక ప్యాకేజీకి వంతపాడి ఏపీ ప్రజలను నట్టేట ముంచారని చలసాని శ్రీనివాస్ సీఎం చంద్రబాబుపై ఫైరయ్యారు. రాజీనామాలు చేసిన వైసీపీ ఎంపీల స్థానంలో ఉప ఎన్నికలు జరిగితే.. తమ మద్దతు వైసీపీకే ఉంటుందని చలసాని స్పష్టం చేశారు. అలాగే, 2019 ఎన్నికల్లో సైతం వైసీపీకే తమ మద్దతు కొనసాగిస్తామని చలసాని శ్రీనివాస్ పేర్కొన్నారు.