ఐటీ లో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ అన్నారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్‌సిటీలో ఈ-పామ్ డిజిటల్ ఇంజనీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీ ఆర్ అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
IT & Industries Minister @KTRTRS along with Arkadiy Dobkin, CEO & President, @EPAMSYSTEMS inaugurated @EPAM_India’s Hyderabad Digital Engineering center today. @jayesh_ranjan, Prl Secy, IT & Industries Dept also participated in the program. pic.twitter.com/68EsBKpzly
— Min IT, Telangana (@MinIT_Telangana) June 28, 2018
దేశంలోనే హైదరాబాద్ నగరం ఉత్తమ నివాస నగరమని మంత్రి కేటీఆర్ అన్నారు.తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నదని అన్నారు.రాష్ట్రంలో డిజిటల్ అక్షరాస్యత, అనుసంధానానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
see also:స్టేషన్ ఘన్పూర్ ప్రజల రుణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది..!!
సాంకేతికత ద్వారా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.నవంబర్‌లో టి-వర్క్స్ ప్రారంభిస్తామని… టి-హబ్ రెండో దశ పనులు జరుగుతున్నాయని అన్నారు.. రాష్ట్రంలోని సాంకేతికత ఉద్యోగుల్లో నైపుణ్యతకు కొదవ లేదని, కార్పోరేట్ సంస్థల అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు.
Minister @KTRTRS interacting with the employees after inaugurating @EPAM_India’s Hyderabad Digital Engineering center. pic.twitter.com/1qBOf2VaDw
— Min IT, Telangana (@MinIT_Telangana) June 28, 2018